Monday, September 8, 2014

ఎముక పుష్టి కి- క్యాల్షియం -ఆహార మార్గం

  •  
  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • ఎముక పుష్టి కి- క్యాల్షియం -ఆహార మార్గం---
క్యాల్షియం మన ఎముకల, దంతాల పటుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు, కణాలు, నాడులు సరిగా పనిచేయటానికీ ఇది తోడ్పడుతుంది. అందుకే పెద్దవాళ్లు రోజుకి వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్యాల్షియం ప్రధానంగా పాలు, పాల పదార్థాల నుంచి లభిస్తుంది. అయితే పాలు ఇష్టం లేనివారు, లాక్టోజ్‌ పడనివారి సంగతేంటి? ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరి. వీటితో క్యాల్షియంతో పాటు ఇతరత్రా విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి.
*అంజీర: ఎండిన అంజీర పండ్లను అరకప్పు తీసుకుంటే 121 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. ఇందులో పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలయను నియంత్రించటం వంటి పలురకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నీషియమూ వీటితో లభిస్తుండటం విశేషం.

*నారింజ: ఒక పెద్ద నారింజ పండులో 74 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్‌ సి కూడా పుష్కలంగా ఉండటంతో పాటు కేలరీలూ తక్కువే.
  •  

*సార్‌డైన్‌ చేపలు: వీటిని 120 గ్రాములు తీసుకుంటే 351 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్‌ బీ12 కూడా అందుతుంది. క్యాల్షియం ఎముకల్లోకి ప్రవేశించటానికి తోడ్పడే విటమిన్‌ డి సైతం వీటిల్లో ఉంటుంది.
  •  

*బెండకాయ: మలబద్ధకాన్ని నివారించే పీచుతో నిండిన బెండకాయలను ఒక కప్పు తింటే 82 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది. అలాగే వీటిల్లో విటమిన్‌ బీ6, ఫోలేట్‌ వంటివీ ఉంటాయి.
  •  

*టోఫు: ప్రోటీన్‌తో పాటు క్యాల్షియంతో కూడిన ఇది శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తుంది. సగం కప్పు టోఫులో 434 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది.
  •  

*బాదంపప్పు: ఆరోగ్యానికి మేలు చేసే పప్పుగింజల్లో (నట్స్‌) భాగమైన బాదం మంచి క్యాల్షియం వనరు. 30 గ్రాముల బాదంపప్పుతో 75 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తినటం మంచిది. బాదంపప్పులో విటమిన్‌ ఈ, పొటాషియం కూడా ఉంటాయి. మితంగా తింటే చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గటానికీ తోడ్పడతాయి.

  • ============================ 
Visit my Website - Dr.Seshagirirao.com

6 comments:

  1. Hello nice blog im from newcastel i found this on yahoouk I seen it on the top ten searches i found this blog very interesting good luck with it i will return to this blog soon

    healthkart coupon code


    ReplyDelete
  2. Hi Thanks for sharing nice and useful information
    BpositiveTelugu magazine we are providing latest Beauty tips , health tips, natural beauty tips, home made beauty tips. for more details please visit below link
    beauty care tips | Beauty tips in Telugu

    ReplyDelete
  3. I have Read this blog over health and food site That is really nice please follow us at :- best diet tips for weight loss and best diet plan for quick weight loss

    ReplyDelete
  4. Output for the best payroll engagement you might be consult with the administrator please consult with us :-There are rigorous and better information about healthy food habits options all coming up in the business all of best weight loss tips and tricks which will surely give down the good things at ease.

    ReplyDelete
  5. Nice Information you have written here. Really Great Stuff. I keep it bookmark for our future purpose. Thanks for the information and links you shared this is so should be a useful and quite informative.
    vitamins and supplements

    ReplyDelete